కొన్ని పరిస్థితులను, కష్టాలను అందరూ తట్టుకోలేరు. వాటిని ఎదుర్కొని నిలబడ్డవారే రియల్ హీరోలు అనిపించుకుంటారు. పది మందికి ఇన్సిపిరేషన్ గా నిలుస్తారు. అలాంటి కేరళ వ్యక్తి నజీబ్. గల్భ్ బాధితుడిగా రెండేళ్లు ఎడారిలో అతను సాగించిన ప్రయాణం ఓ కన్నీటి కథ. అంతులేని వ్యథ. ఇతని స్ఫూర్తికర ప్రయాణాన్ని గోట్ డేస్ అనే నవలగా బెన్యామిన్ అనే రైటర్ రాస్తే, దాన్ని దర్శకుడు బ్లెస్సీ ది గోట్ లైఫ్ అనే సినిమాగా రూపొందించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ నజీబ్ గా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రేపు థియేటర్స్ లోకి వస్తోంది.

కేరళ యువకుడు నజీబ్ గల్భ్ ఉద్యోగం పేరుతో మోసపోతాడు. రెండేళ్లు ఏడారిలో ప్రయాణిస్తూ అనేక కష్టాలు పడతాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా 700 గొర్రెలను కాపాడుకుంటూ ప్రయాణిస్తాడు. స్నానం చేసే అవకాశం, భోజనం దొరికే వీలుండదు. తనతో తెచ్చుకున్న ఎండిన ఆహారం కొంత గొర్రె పాలలో నానబెట్టి తింటాడు. అక్కడి వేడి వాతావరణంలో గొర్రె పాలు దుర్గంధం వస్తుంటాయి. అయినా బతికేందుకు ఆ పాలనే తాగుతాడు. కేరళలో 8 నెలల గర్భవతి అయిన భార్యను వదిలి విదేశీ ఉద్యోగానికి బయలు దేరిన నజీబ్ కు ఇప్పుడు తనకు పుట్టిన బిడ్డ ఎలా ఉందో తెలియదు. వారి జ్ఞాపకాలతో ఊరట చెందుతుంటాడు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రయత్నిస్తాడు. కొన్నేళ్ల తర్వాత చివరకు తన కుటుంబానికి చేరువవుతాడు. నజీబ్ కథ థియేటర్ లోనూ ప్రేక్షకుల చేత కంటతడి పెట్టిస్తుందని మూవీ టీమ్ చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *