కామెడీ ఎంటర్ టైనర్స్ వర్కవుట్ అయితే వసూళ్లకు ఢోకా ఉండదు. ఈ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది శ్రీ విష్ణు హీరోగా నటించిన ఓం భీమ్ బుష్. ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇతర కీ రోల్స్ ప్లే చేశారు. హర్ష కోనుగంటి దర్శకత్వం వహించిన ఓం భీమ్ బుష్ పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లు సాధిస్తోంది. రెండు రోజుల్లో ఈ సినిమా 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

ఈ సినిమా రేంజ్ కు ఇది పెద్ద మొత్తంగా చెప్పుకోవచ్చు. లాజిక్ లేని కథా కథనాలు, క్యారెక్టర్స్ తో నవ్వించింది ఓం భీమ్ బుష్. జాతి రత్నాలు ఫార్మేట్ ను ఫాలో అవుతూ ఆ సినిమాలాగే సక్సెస్ అందుకుంది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యూఎస్ లోనూ మంచి వసూళ్లు దక్కుతున్నాయి. ఈ సినిమా ఇప్పటికే 250 కె డాలర్స్ వసూళ్లను అందుకుందని మూవీ టీమ్ ప్రకటించింది. హీరో శ్రీవిష్ణుకు సామజవరగమన సినిమా విజయం తర్వాత ఓం భీమ్ బుష్ మరో సక్సెస్ ను అందించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *