మెగాస్టార్ చిరంజీవి, హీరో శ్రీకాంత్ మధ్య మంచి అనుబంధం ఉంది. చిరంజీవిని అన్నయ్యలా భావిస్తాడు శ్రీకాంత్. వీరిద్దరు కలిసి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో నటించారు. చిరంజీవికి తానొక బిగ్ ఫ్యాన్ అని చెప్పుకుంటారు శ్రీకాంత్. వీరి మధ్య అనుబంధం మరోసారి వెల్లడైంది. నిన్న హీరో శ్రీకాంత్ బర్త్ డే సందర్భంగా చిరంజీవి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీకాంత్ తో పాటు కుటుంబ సభ్యులు రోషన్, ఊహ, వాళ్ల కూతురు తమ ఇంటికి చిరంజీవికి ఆహ్వానం పలికారు. మెగాస్టార్ స్వయంగా ఇంటికి రావడంతో శ్రీకాంత్ కుటుంబ సభ్యుల్లో సంతోషం కనిపించింది. చిరంజీవి ఇంట ఏ శుభకార్యం జరిగినా ఆ వేడుకల్లో అందరికంటే ముందే ఉంటారు శ్రీకాంత్. అలా మెగా ఫ్యామిలీ మెంబర్ లా మెలుగుతుంటారాయన.