నిర్మాత దిల్ రాజు వారసుడు ఆశిష్, బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లవ్ మీ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 25న ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. హారర్ థ్రిల్లర్ కథతో లవ్ మీ సినిమాను కొత్త దర్శకుడు అరుణ్ భీమవరవు తెరకెక్కించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ సినిమా మీద ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయింది. లవ్ మీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి.

ఓ పాత బంగ్లాలో ఉండే దెయ్యాన్ని ఎవరూ రెండోసారి చూడలేరు. ఒకసారి చూసినప్పుడే చంపేస్తుంది. అలాంటి దెయ్యాన్ని ఓ కుర్రాడు డేట్ కు పిలిస్తే ఆ తర్వాత ఏం జరిగింది అనేది లవ్ మీ సినిమా కథగా టీజర్ లో రివీల్ చేశారు. కీరవాణి మ్యూజిక్, పీసీ శ్రీరామ్ కెమెరా సినిమాకు ఆకర్షణ కానున్నాయి. రౌడీ బాయ్స్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ లవ్ మీ సినిమా సక్సెస్ మీద హోప్స్ పెట్టుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *