సినిమాలతో పాటు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ మీద తన ప్రతిభ చూపిస్తున్నాడు యాక్టర్, హీరో నవీన్ చంద్ర. ఆయన అమోజాన్ తమిళ్ ఒరిజినల్స్ గా చేసిన వెబ్ సిరీస్ “ఇన్స్ పెక్టర్ రిషి”. ఈ సిరీస్ హారర్ క్రైమ్ కథతో డైరెక్టర్ నందిని జె.ఎస్ రూపొందించారు. మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్ పై సుఖ్ దేవ్ లాహిరి నిర్మించారు. “ఇన్స్ పెక్టర్ రిషి” ఈ నెల 29వ తేదీ నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ సిరీస్ ట్రైలర్ ను సత్యభామలో నవీన్ చంద్ర కోస్టార్, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ట్రైలర్ తనకు బాగా నచ్చిందని కాజల్ అగర్వాల్ తెలిపింది.

పోలీసులు మూఢనమ్మకాలను నమ్మరు. ఆ విషయంలోనైనా శాస్త్రీయంగా ఆలోచిస్తారు. కానీ కొన్నిసార్లు ఆ పోలీసులు ఊహకు అందని సంఘటనలు జరుగుతుంటాయి. తీన్ కాడు అనే ప్రాంతంలోని అడవిలో ఇలాగే వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఈ హత్యలకు ఆ అడవిలో తిరిగే దెయ్యమే కారణమని ఊరి ప్రజలు అంటారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చిన ఇన్సిపెక్టర్ రిషి మాత్రం అసలు విషయం కనుక్కోవాలని ప్రయత్నాలు మొదలుపెడతాడు. అతనికీ అతని టీమ్ కు నిజంగానే దెయ్యం ఆ అడవిలో కనిపిస్తుంది. రిషి టీమ్ వణికిపోయేలా చేస్తుంది. అప్పుడు ఇన్సిపెక్టర్ గా రిషి ఏం చేశాడు. ఈ వరుస హత్యల కేసును చేధించగలిగాడా లేదా అనే అంశాలతో ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. నవీన్ చంద్రకు ఇన్సిపెక్టర్ రిషి మరో మంచి వెబ్ సిరీస్ కానుందని అనుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *