వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా నిన్న రాత్రి నుంచి అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఈ నెల 29 నుంచి డిజిటల్ ప్రీమియర్ అవుతుందని టాక్ వినిపించింది. అయితే ఇంకాస్త ముందుగానే ఓటీటీ లో రిలీజైంది. ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ఈ నెల 1న వరల్డ్ వైడ్ గా రిలీజైంది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాహసాల నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ దక్కలేదు. ఉత్తరాదిలో అయితే మరీ దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి. వరుణ్ తేజ్ కెరీర్ లో మరో ఫ్లాప్ ను యాడ్ చేసింది ఆపరేషన్ వాలెంటైన్. ఈ సినిమాను దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హుడా రూపొందించగా..మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటించింది. ప్రైమ్ వీడియోలో ఆపరేషన్ వాలెంటైన్ మేకర్స్ కు ఊరటనిస్తుందో లేదో చూడాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *