ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా గోవా షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ లేటెస్ట్ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాట చిత్రీకరణ చేయనున్నారు. గోవా షెడ్యూల్ లో ఎన్టీఆర్ ఉన్న ఫొటోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఫొటోలో దర్శకుడు కొరటాల శివ, కొరియోగ్రాఫర్ రాజు సుందరం మాస్టర్ కూడా ఉన్నారు. సాంగ్ పిక్చరైజేషన్ కోసం వీరు డిస్కషన్స్ చేసుకుంటున్న సందర్భంలోని ఫొటోను రివీల్ చేశారు.

గోవా షెడ్యూల్ పది రోజుల పాటు సాగనుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తో ఆల్మోస్ట్ షూటింగ్ ఫినిషింగ్ కు చేరుకుంటుంది. క్లైమాక్స్ షూట్ బ్యాలెన్స్ ఉందట. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవర సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ దేవర 1 ఆక్టోబర్ 10న దసరా పండుగ సందర్భంగా రిలీజ్ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *