పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా ఓటీటీ హక్కుల కోసం భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఈ సినిమాను దక్కించుకునేందుకు మేజర్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అమోజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ కల్కి కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సినిమా కోసం దాదాపు 150 కోట్ల రూపాయలు చెల్లించేందుకు కూడా ఈ ఓటీటీ సంస్థలు సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇంత మొత్తం దక్కితే అది భారీ డీల్ అనుకోవచ్చు.

కల్కి 2898 ఎడి సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నారు. వైజయంతీ మూవీస్ సంస్థ దాదాపు 400కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తోంది. ప్రభాస్ తో పాటు దిశా పటానీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,, దీపిక పడుకోన్, మనోజ్ బాజ్ పాయ్ వంటి స్టార్ కాస్టింగ్ ఉండటం వల్ల ఓటీటీ లు టెంప్ట్ అవుతున్నాయి. ఇంత భారీ సినిమాకు వరల్డ్ వైడ్ గా వ్యూయర్ షిప్ ఉంటుంది. మే 9న రిలీజ్ అనౌన్స్ చేసింది కల్కి టీమ్. అయితే ఆ రోజు రిలీజ్ ఉంటుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *