మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరోను సక్సెస్ ఫుల్ గా లాంఛ్ చేసిన సినిమా ఉప్పెన. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టైంది. వంద కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ఉప్పెనతో కృతి శెట్టి స్టార్ హీరోయిన్ అయ్యింది. బుచ్చిబాబు దర్శకుడిగా గట్టి ఫౌండేషన్ వేసుకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు కూడా ఉప్పెన సక్సెస్ ఎంతో బూస్ట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా త్వరలో బాలీవుడ్ రీమేక్ కాబోతోంది.

ఇటీవల రామ్ చరణ్ 16వ సినిమా ఓపెనింగ్ లో పాల్గొన్న బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఉప్పెన సినిమాను హిందీలోకి రీమేక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెప్పాడు. తన చిన్న కూతురు ఖుషి కపూర్ ఈ సినిమాలో నటిస్తుందని అన్నాడు. దీంతో ఉప్పెన సినిమా హిందీ రీమేక్ కన్ఫర్మ్ అయినట్లే అనుకోవాలి. బోనీ కపూర్ పలు తెలుగు, తమిళ సినిమాలను హిందీలో రీమేక్ చేశారు. వీటిలో పోకిరి వంటి సినిమాలు ఉన్నాయి. హిందీ పింక్ ను తెలుగుతో పాటు, తమిళంలోనూ రీమేక్ చేశారు. ఉప్పెన హిందీ రీమేక్ డీటెయిల్స్ త్వరలో వెల్లడి కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *