రామ్ చరణ్ తన కొత్త సినిమా ఆర్ సీ 16ను రీసెంట్ గా లాంఛ్ చేశారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో దర్శకుడు బుచ్చిబాబు రూపొందిస్తున్నారు. నిన్న ఇండస్ట్రీ పెద్దల సమక్షంలో ఘనంగా ప్రారంభమైందీ సినిమా. ఈ చిత్రం నుంచి లేటెస్ట్ అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆర్ సీ 16 సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ ను తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ఇందుకోసం మూవీ టీమ్ ఆయన్ను సంప్రదించిందట. క్యారెక్టర్ గురించి డీటెయిల్స్ తెలుసుకున్న సంజయ్ దత్ నటించేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. కేజీఎఫ్ రెండు సినిమాల తర్వాత విజయ్ నటించిన లియో చిత్రంలో విలన్ గా కనిపించారు సంజయ్ దత్. ఇప్పుడు రామ్ హీరోగా పూరి రూపొందిస్తున్న డబుల్ ఇస్మార్ట్ లోనూ విలన్ గా నటిస్తున్నారు. ఆర్ సీ 16లో సంజయ్ దత్ చేరితే కాస్టింగ్ మరింత స్ట్రాంగ్ అయినట్లే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *