ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో సినిమాలతో కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు లోకేష్ కనకరాజ్. ఆయన హీరోయిన్ శృతి హాసన్ తో కలిసి నటించిన వీడియో ఆల్బమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో శృతి హాసన్ తో లోకేష్ రొమాన్స్ చేస్తున్న వీడియో క్లిప్స్, ఫొటోస్ సర్ ప్రైజ్ చేస్తున్నాయి. ఇనిమెల్ అనే వీడియో ఆల్బమ్ నుంచి ఈ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

ఫుల్ వీడియో యూట్యూబ్ లో రిలీజ్ కు రాబోతోంది. ఈ వీడియో ఆల్బమ్ లో శృతి హాసన్ కు జోడీగా నటించాడు దర్శకుడు లోకేష్. ఆయనలో దర్శకుడితో పాటు ఇలా నటుడు కూడా ఉన్నాడని తెలిసి కోలీవుడ్ ఫిల్మ్ లవర్స్ ఆశ్చర్యపోతున్నారు. శృతి హాసన్ మంచి సింగర్ అని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మ్యూజిక్ వీడియో చేసింది శృతి హాసన్. కమల్ హాసన్ తో విక్రమ్ 2 చేసే సన్నాహాలు చేస్తున్నారు లోకేష్ కనకరాజ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *