మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇవాళ మ్యూజిక్ సిట్టింగ్స్ లో చిరంజీవి, కీరవాణితో పాటు త్రిష కూడా పాల్గొంది. ఈ ఫొటోను త్రిష ట్విట్టర్ లో షేర్ చేసింది. డివైన్ అండ్ లెజెండరీ మార్నింగ్ అంటూ త్రిష పోస్ట్ చేసింది. మ్యూజిక్ సిట్టింగ్స్ లో డైరెక్టర్ ఉంటాడు, మహా అయితే హీరో కూడా పాల్గొంటాడు కానీ విశ్వంభర మ్యూజిక్ సిట్టింగ్స్ కు త్రిష కూడా వెళ్లడం విశేషమే.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కిస్తున్నారు. భారీ సోషియో ఫాంటసీ మూవీగా యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో త్రిషతో పాటు హీరోయిన్స్ ఇషా చావ్లా, సురభి కీ రోల్స్ చేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి జనవరి 10న విశ్వంభర స్క్రీన్స్ మీదకు రాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *