హృతిక్ రోషన్, దీపిక పదుకోన్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటించిన బాలీవుడ్ మూవీ ఫైటర్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీలోకి రావడం ఆలస్యమైంది. ఫిల్మ్ లవర్స్ ను సర్ ప్రైజ్ చేస్తూ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని వయాకామ్ 18, మార్ ఫ్లిక్స్ సంస్థలు నిర్మించాయి.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాహసాన్ని చూపించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. ఫైటర్ ఎఫెక్ట్ తో ఇదే ఫార్మేట్ లో వచ్చిన వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ దెబ్బతింది. ఫైటర్ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో చూస్తున్న ఆడియెన్స్ తమ ఫేవరేట్ సీన్స్ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నారు.