పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఇటీవల భగత్ బ్లేజ్ పేరుతో ఓ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో పవన్ జనసేన పార్టీ గుర్తు గ్లాస్ గురించి డైలాగ్స్ ఉన్నాయి. రాజకీయ ఉద్దేశంతో ఈ డైలాగ్స్ ను టీజర్ లో పెట్టారని, వీటిని ఎన్నికల కోడ్ నేపథ్యంలో పరిగణలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ నాయకులు అంటున్నారు.

ఇది ఏపీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి వెళ్లింది. రీసెంట్ ప్రెస్ మీట్ లో ఏపీ ఎలక్షన్ అధికారులు మాట్లాడుతూ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ లో పొలిటికల్ డైలాగ్స్ ఉంటే తప్పేం లేదని, అది రాజకీయ ప్రకటనల కిందకు వస్తుందని, ఇందుకు ముందస్తు అనుమతి తీసుకోవాలని అన్నారు. పొలిటికల్ అడ్వర్టయిజ్ మెంట్ మీద బ్యాన్ ఏమీ లేదు.

ఒకవేళ పవన్ కల్యాణ్ సినిమాలో రాజకీయాల ప్రస్తావన, డైలాగ్స్ ఉంటే పరిశీలించి, ముందుగా అనుమతి తీసుకోమని చెబుతామని ఎలక్షన్ అధికారులు అంటున్నారు. మే 13న ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇప్పటికే అక్కడ ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. జనసేన తరుపున పోటీ చేస్తున్న పవన్, ప్రచారంలో భాగంగా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి భగత్ బ్లేజ్ ను రిలీజ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed