సూర్య హీరోగా నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ కంగువ టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. నిన్న సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. 12 గంటల్లోపే కంగువ టీజర్ కు 10 మిలియన్స్ కు పైగా వ్యూస్ దక్కాయి. కంగువ సినిమా మీద ఆడియెన్స్ లో ఉన్న క్రేజ్ ను ఈ డిజిటల్ వ్యూస్ చూపిస్తున్నాయి. కంగువ టీజర్ లో సూర్య క్యారెక్టర్, ఫైట్ సీక్వెన్స్ లు, భారీ మేకింగ్, విజువల్ ఎఫెక్టులు ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేస్తున్నాయి.
కంగువ సినిమాను స్టూడియో గ్రీన్ తో కలిసి యూవీక్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్నాయి. త్వరలోనే కంగువను పలు జాతీయ, అంతర్జాతీయ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.