అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ టైటిల్ , ఫస్ట్ లుక్ ను మేకర్స్ రివీల్ చేశారు. అమోజాన్ ప్రైమ్ వీడియో ఈవెంట్ లో భాగంగా ఈ సినిమా పోస్టర్, టైటిల్ విడుదల చేశారు. అనుష్క కొత్త సినిమా ఘాటి అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వ్యవసాయంలో నష్టాలకు గురైన ఓ మహిళ కథతో క్రిష్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత అనుష్క చేస్తున్న సినిమా ఇదే. ఇటీవలే ఘాటి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకుంది. ఆ తర్వాత డ్రగ్ కేసులో దర్శకుడు క్రిష్ ఇరుక్కోవడంతో రెగ్యులర్ షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు తిరిగి కొత్త షెడ్యూల్ కు రెడీ అవుతోంది ఘాటి. క్రిష్ అనుష్క కాంబోలో గతంలో వచ్చిన వేదం మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు ఘాటి సినిమా కూడా ఆసక్తి కలిగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *