రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ఆర్ సీ 16 గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమానికి చిరంజీవి, డైరెక్టర్స్ సుకుమార్, శంకర్, కొరటాల శివ, రాజమౌళి తదితరులు గెస్టులుగా హాజరయ్యారు. జాన్వీ కపూర్ కూడా ఈ లాంఛ్ ఈవెంట్ లో పాల్గొంది. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ లాంఛింగ్ ఈవెంట్ ఫొటోస్, వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామా సినిమా ఇది. ఈ చిత్రానికి ఆర్ సీ 16 అనే వర్కింగ్ టైటిల్ పెట్టుకున్నారు. అయితే పెద్ది అనే టైటిల్ ను ఈ సినిమాకు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్ చరణ్ కబడ్డీ ప్లేయర్ గా కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఓ కీ రోల్ ప్లే చేస్తున్నారు. త్వరలోనే ఆర్ సీ 16 సెట్స్ మీదకు వెళ్లనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed