బాహుబలి 2లో మహేంద్ర బాహుబలిగా ప్రభాస్, భల్లాలదేవుడిగా రానా ఫేస్ టు ఫేస్ క్లైమాక్స్ ఫైట్ హైలైట్ అయ్యింది. రీసెంట్ గా రిలీజ్ చేసిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ‘కంగువ’ టీజర్ లోనూ ఉధిరన్, కంగువ పోరాడే ఈ షాట్ బాహుబలి 2ను గుర్తు చేసింది. ‘కంగువ’ టీజర్ వరల్డ్ క్లాస్ క్వాలిటీతో ఉంది. ఈ విజువల్ క్వాలిటీ కోసం టీమ్ ఎంత కష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు. రియల్ మేకింగ్ తో పాటు వీఎఫ్ఎక్స్ షాట్స్ కూడా న్యాచురల్ గా ఉండి ఆకట్టుకున్నాయి.

కంగువ క్యారెక్టర్ గా మారిపోయారు సూర్య. ఆ పాత్రలా మేకోవర్ కావడమే కాదు ఎమోషన్స్ లోనూ ఆ యుద్ధ వీరుడిగా కనిపించారు. పులితో సూర్య ఫైట్ చేసే షాట్ ఒకటి టీజర్ లో మెరిసింది. బాబీ డియోల్ చేసిన ఉధిరన్ క్యారెక్టర్ తో కంగువ పోరాటం నువ్వా నేనా అనేలా ఉంది. వార్ ఎపిసోడ్స్ గ్రాండ్ గా పిక్చరైజ్ చేశారు. టెక్నికల్ గా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, విజువల్ ఎఫెక్ట్స్ టాప్ క్వాలిటీతో ఉన్నాయి. సూర్య ఈ టీజర్ ను ట్వీట్ చేస్తూ గ్లింప్స్ ఆఫ్ కంగువ వచ్చేసింది అంటూ పోస్ట్ చేశారు.

‘కంగువ’ సినిమాను భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పలు భారతీయ, అంతర్జాతీయ భాషల్లో 2డీతో పాటు త్రీడీలోనూ ‘కంగువ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *