భగత్ బ్లేజ్ పేరుతో పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ను పక్కా పొలిటికల్ గా కట్ చేశారు. డైలాగ్స్ జనసేన టీ గ్లాస్ ను పొగుడుతూ పవన్ తో చెప్పించారు. గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది..అంటూ జనసేన ఓడిపోయినా మళ్లీ బలంగా తిరిగొస్తుందనే సందేశాన్ని ఏపీ ప్రజల్లోకి పంపాలని ప్రయత్నించారు. అలాగే గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం అంటూ మరో డైలాగ్ జనసేన పార్టీ గుర్తుపై పెట్టారు. ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి భారీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను ఇలా జనసేన యాడ్ చేసేయడం వింతగా ఉంది. ప్రొడ్యూసర్స్ కు ఇష్టం లేకున్నా ఈ టీజర్ కు ఒప్పుకోక తప్పని పరిస్థితి ఉండి ఉంటుంది.

టీజర్ టైటిల్స్ లో డీఎస్పీ మ్యూజికల్, హరీశ్ శంకర్ మ్యాజికల్ అని వేశారు. డీఎస్పీ మ్యూజికల్ వరకు ఓకే, కానీ హరీశ్ శంకర్ మ్యాజికల్ ఎందుకు వేశారో అర్థం కాలేదు. ఈ డైరెక్టర్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా మ్యాజిక్ చేసేందేం లేదు. ఒక్క హిట్ గబ్బర్ సింగ్, అదీ రీమేక్, అందులో పవన్ డైరెక్షన్. ఆ తర్వాత హరీశ్ శంకర్ కు అన్నీ ఫ్లాపులే. ఉస్తాద్ భగత్ సింగ్ కు ఇప్పుడు రిలీజ్ చేసిన గ్లింప్స్ లో షాట్స్ మొత్తం రొటీన్ గా ఉన్నాయి. ఈ గుడి ఉత్సవాలలో ఫైట్ సీన్స్ ఎన్నో సినిమాల్లో చూసినవే. పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ లోనూ ఇంటర్వెల్ ఫైట్ ఇలాగే ఉత్సవాల నేపథ్యంతో ఉంటుంది. ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ ఏపీ రాజకీయ కార్యకలాపాలు ముగిసిన తర్వాత తిరిగి సెట్స్ మీదకు వెళ్లనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *