దర్శకురాలు సుధా కొంగర, హీరో సూర్య కాంబినేషన్ ఎంతో స్పెషల్. వీరు కలిసి చేసిన ఆకాశమే హద్దురా సినిమా సినీ ప్రియులకు ఫేవరేట్ మూవీ అయ్యింది. ఉత్తమ నటుడిగా సూర్యకు జాతీయ అవార్డ్ అందించింది. ఓటీటీ రిలీజైనా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ కాంబోలో మరో సినిమా అనౌన్స్ కావడం సూర్య ఫ్యాన్స్ ను ఖుషి చేసింది. ఈ సినిమాకు పురణానూరు అనే టైటిల్ పెట్టారు. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వె‌ళ్లేందుకు మరికొంత టైమ్ పట్టేలా ఉంది. ఈ విషయాన్ని సూర్య, సుధా కొంగర అఫీషియల్ గా ప్రెస్ నోట్ ద్వారా వెల్లడించారు.

తమ కాంబినేషన్ లో చాలా స్పెషల్ అని, అందుకే పురణానూరు సినిమా కోసం మరికొంత టైమ్ తీసుకోవాలని నిర్ణయించినట్లు ప్రెస్ నోట్ లో వెల్లడించారు సుధా కొంగర, హీరో సూర్య. ఈ సినిమా ఇంకా బాగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే సెట్స్ మీదకు సినిమాను తీసుకెళ్తామని ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. సూర్య రిలీజ్ చేసిన ఈ ప్రెస్ నోట్ తో పురణానూరు మూవీ ఇంకా ఆలస్యమయ్యేలా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం పీరియాడిక్ యాక్షన్ మూవీ కంగువ ఫినిష్ చేసి రిలీజ్ కు రాబోతున్నారు సూర్య.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *