రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న క్రేజీ మూవీ ఆర్ సీ 16 రేపే గ్రాండ్ లాంఛింగ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను అఫీషియల్ గా రేపు మొదలుపెట్టబోతున్నారు. దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను రూపొందించనున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ ఓ కీ రోల్ చేయబోతున్నారు.

ఆర్ సీ 16 లాంఛ్ కార్యక్రమానికి చిత్రబృందంతో పాటు సినీ పరిశ్రమలోని పలువురు సెలబ్రిటీలు హాజరుకానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ఉత్తరాంధ్ర నేపథ్యంతో విలేజ్ లో జరిగే స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. లాంఛింగ్ జరిగినా రెగ్యులర్ షూటింగ్ కోసం మరికొంత టైమ్ తీసుకోనున్నారు. ఈలోగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాను ఫినిష్ చేయాలని భావిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *