మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ చాలాకాలం ట్రెడిషనల్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చింది. ఆశిష్ హీరోగా నటించిన రౌడీ బాయ్స్ సినిమాతో ముద్దులు మొదలుపెట్టింది. అప్పుడే నావల్ షోస్ కూడా చేసింది. అప్పటిదాకా తాను చేయని గ్లామర్ షోను రౌడీ బాయ్స్ తో బిగిన్ చేసింది. ఈ గ్లామర్ షో టిల్లు స్క్వేర్ సినిమాతో మరో స్టేజ్ కు వెళ్లింది. ఈ సినిమాలో హాట్ గా కనిపించిన అనుపమ..సినిమాకే ఆకర్షణగా నిలుస్తోంది. ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్ చేయడంపై అనుపమ రియాక్ట్ అయ్యింది.

రీసెంట్ గా ప్రెస్ మీట్ లో అడిగిన ప్రశ్నకు ఫ్రస్టేషన్ తోనే సమాధానం చెప్పింది. నేను ఏదైనా సినిమా చేస్తే..ఇందులో అనుమప చేసేందుకేం లేదు అని అంటారు. ఏదైనా కీ రోల్ చేసి కథలో ప్రాధాన్యమున్న పాత్రలో నటిస్తే..ఇలా ఎందుకు నటించింది అంటారు. ఏం చేసినా ఏదో ఒకటి అంటారు. నన్నేం చేయమంటారు సినిమాలు మానేసి ఇంట్లో కూర్చోవాలా అంటూ ఆన్సర్ ఇచ్చింది. అనుపమ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా ఈ నెల 29న రిలీజ్ కు రెడీ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *