ప్రతి రోజు పండగే, ట్యాక్సీ వాలా, బేబి వంటి బ్లాక్ బస్టర్, కల్ట్ సినిమాలతో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు ఎస్ కేఎన్. ఆయన తన స్నేహితుడు, స్టార్ డైరెక్టర్ మారుతితో కలిసి మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటించిన తమిళ మూవీ లవర్ ను “ట్రూ లవర్” పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. విభిన్న ప్రేమ కథతో దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. “ట్రూ లవర్” సినిమాను ఈ నెల 10వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాలోని హైలైట్స్ తెలిపారు నిర్మాత ఎస్ కేఎన్.

– మాది చిన్న సినిమా. చిన్న రిలీజ్. ఈగిల్ తో పోటీ పడే పెద్ద సినిమా కాదు. అయినా హంబుల్ గా అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్న నిర్ణయాన్ని తీసుకుని ఈ నెల 10వ తేదీన ట్రూలవర్ రిలీజ్ చేస్తున్నాం. రాజా సాబ్ సినిమాను మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఆ టీమ్ లో నేనూ ఉన్నాను. ఆ సంస్థ మా ఫ్రెండ్లీ బ్యానర్ లాంటిదే. చిన్నా, పెద్దా అన్ని సినిమాలు బాగుండాలి. అన్ని సినిమాలు మంచి సక్సెస్ కావాలి. అప్పుడే ఎక్కువమంది టెక్నీషియన్స్ కు పని దొరుకుతుంది.

– ఒక ఫ్రెండ్ ద్వారా “ట్రూ లవర్” సినిమా మా దృష్టికి వచ్చింది. ఆయన మారుతిని కలిసి సినిమా చూడమని అన్నాడు. మారుతి నాకు చెప్పి నువ్వూ రా ఇద్దరం మూవీ చూద్దాం అన్నాడు. మా ఇద్దరికీ మూవీ నచ్చింది. దాంతో తెలుగులో చేద్దామని నిర్ణయించాం. ట్రూలవర్ ను మా ప్రీవియస్ మూవీ బేబితో పోల్చలేం. రెండు వేర్వేరు తరహా మూవీస్. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు తమతో పోల్చుకుంటారు. ప్రేమలో ఉన్న యువతకు రీచ్ అయ్యే సబ్జెక్ట్ ఇది. లవర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సినిమాలో దర్శకుడు చూపించాడు. తను ఎంచుకున్న కథకు డైరెక్టర్ పూర్తి న్యాయం చేశాడు. నేను స్ట్రైట్ సినిమాలు చేసేందుకే ఇష్టపడతాను. అది పూర్తిగా నా ప్రోడక్ట్ గా ఉంటుంది. కానీ ఇలాంటి మంచి పాయింట్స్ తో సినిమా వచ్చినప్పుడు కూడా అవి అట్రాక్ట్ చేస్తుంటాయి. నా స్నేహితుడు బన్నీవాస్ డిస్ట్రిబ్యూషన్ కు ముందుకొచ్చాడు. ఇవాళ మిగతా భాషల సినిమాలు ఎలా ఉన్నాయి అనేది రిలీజైన గంటల్లో తెలిసిపోతోంది. అందుకే అక్కడా ఇక్కడా ఒకే డేట్ కు రిలీజ్ చేస్తేనే మంచిది. మేము 2018 సినిమా ఇక్కడ థియేటర్స్ లో రిలీజ్ చేయగానే…మలయాళంలో ఓటీటీలోకి వచ్చింది. లవ్ టుడే సినిమా కూడా అలాగే ఇక్కడ థియేటర్స్ లో ఉండగానే ఓటీటీలోకి వచ్చింది. ఒకేసారి రిలీజ్ చేసుకోకుంటే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి.

– ఏ రిలేషన్ లోనైనా నమ్మకం అనేది పునాదిగా ఉంటుంది. ఉండాలి. “ట్రూ లవర్” సినిమాలో మెయిన్ పాయింట్ అదే. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చాలా స్ట్రైకింగ్ గా అనిపించాయి. అవి చూసే సినిమా సక్సెస్ ను బిలీవ్ చేశా.

– గీతగోవిందం, ట్యాక్సీ వాలా…ఒక్కో సినిమాకు ఒక్కో రేంజ్ ఉంటుంది. కానీ రెండు సూపర్ హిట్ సినిమాలే. సుహాస్ అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా మంచి సక్సెస్ అయ్యింది. మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. మార్చి వరకు మంచి రన్ ఉంటుందని ఆశిస్తున్నాం. నాకు సహజంగా లవ్ స్టోరీస్, యూత్ ఫుల్ మూవీస్ ఇష్టం. నేను మారుతి గారితో కలిసి చేసిన ఈ రోజుల్లో కూడా యూత్ ఫుల్ మూవీ. పెద్ద స్టార్స్ తో సినిమాలు చేస్తే దాని బడ్జెట్ ఎక్కువ కాబట్టి మేకింగ్ కు మేము ప్రిపేర్ కావాలి. కొత్త వాళ్లతో మూవీ చేసినప్పుడు కంటెంట్ యూత్ ఫుల్ గా ఉంటే ఆ సినిమాల రీచ్ బాగుంటుంది. నెక్ట్ నేను చేస్తున్న నాలుగు సినిమాల్లో మూడు యూత్ ఫుల్ మూవీస్ ఉంటాయి. ఒకటి సైన్స్ ఫిక్షన్ తో ఔటాఫ్ ది బాక్స్ గా ఉంటుంది.

– బేబి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నాం. మరో ఒకట్రెండు వారాల్లో అనౌన్స్ చేస్తాం. కల్ట్ బొమ్మ అనే టైటిల్ రిజిస్టర్ చేయించాను. హిందీలో స్టార్ కిడ్స్ లేదా కొత్త వాళ్లతో బేబీ రీమేక్ చేయాలనుకుంటున్నాం. సాయి రాజేశ్ హిందీలో డైరెక్టర్ చేయబోతున్నారు. అర్జున్ రెడ్డి ఇక్కడి కంటే హిందీలో హ్యూజ్ గా కలెక్షన్స్ చేసింది. బేబి కూడా అలాగే బాలీవుడ్ లో వైడ్ రేంజ్ కలెక్షన్స్ తెచ్చుకుంటుందని ఆశిస్తున్నా. సందీప్ వంగాలో ఉన్న అగ్రెసివ్ నెస్ సాయి రాజేశ్ లో కూడా ఉంది. ప్రస్తుతం సంతోష్ శోభన్, ఆనంద్ దేవరకొండతో సినిమాలు చేస్తున్నాను. అలాగే ఓ సూపర్ న్యాచురల్ మూవీ చేయాలి. సందీప్ రాజ్ తో కూడా ఓ ప్రాజెక్ట్ అనుకుంటున్నాం. ప్రొడ్యూసర్ గా అప్పర్ ప్రైమరీ స్థాయిలో ఉన్నాను. కాలేజ్ స్థాయికి వచ్చాక అల్లు అర్జున్ తో సినిమా నిర్మిస్తా.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *