హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఫైటర్ సినిమా నుంచి దీపిక పడుకోన్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో స్క్వాడ్రన్ లీడర్ మినల్ రాథోడ్ పాత్రలో దీపిక కనిపించనుంది. ఆమె క్యారెక్టర్ సినిమాలో పవర్ ఫుల్ గా ఉంటుందని ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా తెలుస్తోంది.
వయాకామ్ స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫైటర్ సినిమాను దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ రూపొందిస్తున్నారు. హృతిక్ తో ఈ దర్శకుడు తెరకెక్కించిన గత సినిమా వార్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడీ సినిమాకే సీక్వెల్ వార్ 2 రాబోతోంది. ఫైటర్ సినిమాలో అనిల్ కపూర్ ఓ కీ రోల్ చేస్తున్నారు. ఫైటర్ సినిమాను వచ్చే రిపబ్లిక్ డేకు రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.