సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో నటిగా, హీరోయిన్ గా , డ్యాన్సర్ గా సిల్క్ స్మితకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆమెకు సెపరేట్ సెక్షన్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు. చిన్న వయసులో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది సిల్క్ స్మిత. ఈ నటి జీవితాన్ని ఆధారంగా చేసుకుని గతంలో బాలీవుడ్ లో విద్యా బాలన్ హీరోయిన్ గా ది డర్టీ పిక్చర్ అనే సినిమా వచ్చింది.

ఇప్పుడు కంప్లీట్ గా సిల్క్ స్మిత బయోపిక్ తెరకెక్కుతోంది. సిల్క్ స్మిత ది అన్ టోల్డ్ స్టోరీ అనే పేరుతో ఈ సినిమాను దర్శకుడు జయరామ్ తెరకెక్కిస్తున్నారు. ఎస్ బీ విజయ్ నిర్మిస్తున్నారు. సిల్క్ స్మిత 63వ జయంతి సందర్భంగా ఇవాళ ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో సిల్క్ స్మితగా చంద్రిక రవి కనిపించబోతోంది. ఈమె ఇటీవల వీర సింహారెడ్డి సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *