స్టార్ హీరో ప్రభాస్ నటించిన హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ ట్రైలర్ యూట్యూబ్ వ్యూస్ లో రికార్డ్ లు సృష్టిస్తోంది. 18 గంటల్లో సలార్ ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. నిన్న సాయంత్రం 7.19 నిమిషాలకు సలార్ ట్రైలర్ రిలీజ్ కాగా..ఈ సాయంత్రం అదే సమయానికి ఇంకా ఎన్ని మిలియన్ వ్యూస్ యాడ్ అవుతాయో చూడాలి.

ఆ టైమ్ కి 24 గంటల్లో సలార్ ట్రైలర్ క్రియేట్ చేసే వ్యూయింగ్ రికార్డ్ తెలుస్తుంది. ట్రైలర్ లోని టాప్ క్వాలిటీ యాక్షన్, భారీ మేకింగ్, ప్రభాస్ డైలాగ్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. సలార్ ఈనెల 22న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నెల 15వ తేదీ నుంచి టికెట్ బుకింగ్స్ మొదలుకానున్నాయి. ఓవర్సీస్ లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed