స్టార్ హీరో ప్రభాస్ కొత్త సినిమా సలార్ ట్రైలర్ నిన్న రాత్రి 7.19 నిమిషాలకు రీలీజైంది. సలార్ మీదున్న అంచనాలకు తగినట్లుగా ట్రైలర్ హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సులు, ఎమోషనల్ కంటెంట్ తో ఆకట్టుకుంది. ఇద్దరు స్నేహితుల మధ్య సాగే భారీ యాక్షన్ డ్రామాగా సలార్ ఉండనున్నట్లు ట్రైలర్ తో తెలుస్తోంది. ఇక ఈ ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ సలార్ టీమ్ ను ఖుషి చేస్తోంది.

ఈ క్రేజ్ లో సలార్ గురించి లేటెస్ట్ అప్ డేట్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సలార్ నుంచి కొద్ది రోజుల్లో మరో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేస్తారట. ఈ సెకండ్ ట్రైలర్ ను కట్ చేసే పనుల్లో ప్రస్తుతం టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 22న సలార్ సినిమా రిలీజ్ కు వస్తుండగా..సరిగ్గా వన్ వీక్ ముందు అంటే ఈ నెల 15న సలార్ ట్రైలర్ 2 విడుదల చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఆ రోజే సలార్ టికెట్ బుకింగ్స్ కూడా ప్రారంభం కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed