రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ అదిరిపోయాయి. ఈ సినిమా డే 1 కలెక్షన్స్ లో బిగ్ స్టార్స్ సినిమాలతో పోటీ పడింది. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ చైన్స్ లో ఈ సినిమాకు 24.40 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇది ఇండియన్ మూవీస్ లో థర్డ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ కావడం విశేషం. గతంలో షారుఖ్ హీరోగా నటించిన పఠాన్ (29 కోట్లు), జవాన్ (27 కోట్లు) సినిమాలకు మాత్రమే ఇంతకుమించిన డే 1 కలెక్షన్స్ వచ్చాయి. ఇక యానిమల్ సినిమాకు వరల్డ్ వైడ్ 116 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావడం సినిమా సక్సెస్ రేంజ్ ను చూపిస్తోంది.

డే 1 కలెక్షన్స్ లో కేజీఎఫ్ 2, సల్మాన్ టైగర్ 3 సినిమాలను దాటేసింది యానిమల్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ సినిమా మీద యూత్ ఆడియెన్స్ లో ఉన్న క్రేజ్ ఈ కలెక్షన్స్ లో కనిపించింది. తండ్రీ కొడుకుల మధ్య సెంటిమెంట్, యాక్షన్, రొమాన్స్ వంటి అంశాలతో యానిమల్ సక్సెస్ ఫుల్ టాక్ తెచ్చుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *