నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాకు సెన్సార్ నుంచి క్లీన్ యూ సర్టిఫికెట్ దక్కింది. వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త దర్శకుడు శౌర్యువ్ ఈ సినిమాను రూపొందించారు. శృతి హాసన్, మృణాల్ ఠాకూర్, బేబి కియారా కీ రోల్స్ చేశారు. హాయ్ నాన్న ఫాదర్ డాటర్ సెంటిమెంట్ తో తెరకెక్కింది. ఈ నెల 7న హాయ్ నాన్న రిలీజ్ కాబోతోంది.

నాని గత సినిమా దసరా కంప్లీట్ యాక్షన్ డ్రామా, మాస్ మూవీ కాగా…హాయ్ నాన్న క్లీ యూ సర్టిఫికెట్ తో వస్తున్న ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్ టైనర్. ఓ మాస్ మూవీ చేసిన తర్వాత కంప్లీట్ ఛేంజ్ కనిపించేలా తండ్రీ కూతురు సెంటిమెంట్ కథతో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేశాడు నాని. అయితే మాస్ యాక్షన్ మూవీకి ఉన్నంత క్రేజ్, రీచ్ ఈ హాయ్ నాన్న సినిమాకు ఉండకపోవచ్చని ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. అందుకే ఈ సినిమాకు రావాల్సినంత హైప్ రాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *