స్టార్ హీరో ప్రభాస్ నటించిన సలార్ సినిమా ట్రైలర్ కొద్ది సేపటి క్రితం రిలీజైంది. 3 నిమిషాల 47 సెకన్ల ఈ ట్రైలర్ అదిరిపోయింది. ఈ ట్రైలర్ లో దాదాపు కథను రివీల్ చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. దేవ, వరద అనే ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే కథగా సలార్ ఉంటుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇందులో దేవ క్యారెక్టర్ లో ప్రభాస్, వరద పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు.

సలార్ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే …వరద కోసం దేవ ఎలాంటి సాహసం అయినా చేస్తాడు. వరదను ఏమైనా అంటే వాడి పని దేవ చేతిలో ఖతమే. వెయ్యేళ్ల క్రితం కొందరు క్రూరమైన మనుషులు ఊర్లను, పట్టణాలను ఆక్రమించుకుంటూ రక్తపాతం సృష్టించారు. వారు ఆక్రమించుకున్న ఆ ప్రాంతానికి కాన్సార్ సామ్రాజ్యం అనే పేరు వస్తుంది. ఆ కాన్సార్ ను వరద తండ్రి అజమాయిషీ చేస్తుంటాడు. తన తర్వాత వరద కాన్సార్ కు అధిపతి కావాలనుకుంటాడు అతని తండ్రి. అయితే కుర్చీ కోసం ఇక్కడా కుతంత్రాలు జరుగుతాయి. రష్యా నుంచి, సెర్బియా నుంచి కిరాయి సైన్యం కాన్సార్ లోకి వస్తుంది. వందలాది మంది సైన్యాన్ని ఎదిరించేందుకు వరద తన స్నేహితుడు దేవను ఒక్కడినే పిలుస్తాడు. దేవ ఆ వందల మంది సైన్యాన్ని ఎలా మట్టికరిపించాడు అనేది తెరపై చూడాల్సిన యాక్షన్ వండర్. సలార్ ట్రైలర్ లో ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ సూపర్బ్ గా ఉన్నాయి. గోడలు కట్టేదే భయంతో..లోపల ఉన్నవాళ్లు బయటకు పోతారని కాదు, బయటి వాళ్లు లోపలికి వస్తారని అనే డైలాగ్ తో పాటు చివరలో ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ అనే డైలాగ్ అదిరిపోయింది. సలార్ ట్రైలర్ ఒక ఫీస్ట్ లా కట్ చేశారు. ఈ నెల 22న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ నెల 15 నుంచి టికెట్ బుకింగ్స్ ప్రారంభమవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed