షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా డుంకీ నుంచి థర్డ్ డ్రాప్ రిలీజ్ చేశారు. నిఖలే తే హమ్ కభీ హమ్ ఘర్ సే అనే పాటను డ్రాప్ 3 గా రిలీజ్ చేసింది డుంకీ టీమ్. ఇప్పటిదాకా రిలీజ్ చేసిన కంటెంట్ లో డ్రాప్ 1 ఒక్కటే టీజర్ లా ఉండగా..డ్రాప్ 2, డ్రాప్ 3 లిరికల్ సాంగ్స్ విడుదల చేశారు.
ఇవాళ రిలీజ్ చేసిన డ్రాప్ 3లోని పాట విదేశాలకు ఉద్యోగాల కోసం వలస వెల్లిన వారు తమ ఇంటిని, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ను ఎలా మిస్ అవుతున్నారో చూపించారు. ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లినా ఆలోచనలన్నీ సొంతూరి మీదే ఉన్నాయంటూ వాళ్ల ఎమోషన్స్ ఈ పాటలో చెప్పారు. షారుఖ్ తో పాటు తాప్సీ, వికీ కౌశల్ కీ రోల్స్ చేశారు. దర్శకుడు రాజు హిరాణీ రూపొందించిన డుంకీ ఈనెల 21న రిలీజ్ కానుంది.