స్టార్ హీరోయిన్ నయనతారకు ఆమె భర్త విగ్నేష్ లగ్జరీ కారు గిఫ్ట్ గా ఇచ్చాడు. రీసెంట్ గా నయనతార తన పుట్టినరోజు జరుపుకుంది. ఈ బర్త్ డే బహుమతిగా బెంజ్ కారు బహుమతిగా ఇచ్చాడు విగ్నేష్. ఈ కారు విలువ రెండున్నర కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది. ఈ కారు ఫొటోను నయనతార ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

వెల్ కమ్ హోమ్ యూ బ్యూటీ అంటూ కారుపై తన ఇష్టాన్ని చూపించింది నయనతార. అలాగే మంచి గిప్ట్ ఇచ్చిన భర్త విగ్నేష్ కు థ్యాంక్స్ చెప్పింది. నయనతార తన కొత్త సినిమా అన్నపూరణి రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. ఇది నయనతార నటించిన 75వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో చెఫ్ గా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించే బ్రాహ్మణ యువతిగా నయనతార కనిపించనుంది. రేపు ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *