కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అయ్యారు. ఆయన బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాలన్నింటికీ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. పుష్ప 2 సినిమా గురించి ఆయన ఓ లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. రీసెంట్ గా డైరెక్టర్ సుకుమార్ ను కలిసిన జానీ మాస్టర్ పుష్ప 2లో ఓ పాటకు కొరియోగ్రఫీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పాట సూపర్బ్ గా ఉంటుందని చెప్పాడు.

దర్శకుడు సుకుమార్ ని కలవడం ఆయనతో మాట్లాడటం చాలా హ్యాపీగా, ఇన్సిపిరేషనల్ గా ఉందని జానీ మాస్టర్ పేర్కొన్నాడు. సక్సెస్, ఫెయిల్యూర్, లైఫ్ గురించి సుకుమార్ చెప్పిన మాటలు చాలా స్ఫూర్తినిచ్చాయని జానీ మాస్టర్ చెప్పాడు. పుష్ప సినిమా శ్రీవల్లి పాటకు కొరియోగ్రాఫ్ చేసింది జానీ మాస్టరే. ఆ పాటలో అల్లు అర్జున్ చెప్పు వదిలి చేసే స్టెప్ చాలా ఫేమస్ అయ్యింది. ఇప్పుడు అలాంటి స్టెప్స్ పుష్ప 2 సాంగ్ లోనూ ప్లాన్ చేస్తున్నారట జానీ మాస్టర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *