షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న డంకీ సినిమా రిలీజ్ డేట్ ఎట్టకేలకు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సలార్ కు పోటీగా రిలీజ్ అని చెప్పుకోవడమే గానీ వాళ్లు ప్రకటించలేదు. లేటెస్ట్ గా తమ సినిమాలోని రెండో పాట రిలీజ్ సందర్భంగా డంకీ రిలీజ్ డేట్ ను పోస్టర్ పై వేశారు. లట్ ఫుట్ గయా అనే పాటను ఇవాళ రిలీజ్ చేస్తున్నారు.
ఈ పాట రిలీజ్ అనౌన్స్ మెంట్ సందర్భంగా ఇచ్చిన పోస్టర్ లో డిసెంబర్ 21న డంకీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. దీంతో సలార్ కంటే ఒక రోజు ముందుగానే డంకీ థియేటర్స్ లోకి వస్తోంది. వరల్డ్ వైడ్ డే 1 క్లాష్ ఈ రెండు భారీ సినిమాల మధ్య తప్పినట్లయింది. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో షారుఖ్ నటిస్తున్న డంకీపై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.