నాగ చైతన్య హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు తండేల్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ టైటిల్ ఇప్పటికే ప్రచారంలో ఉంది. అదే టైటిల్ ను సినిమాకు పెట్టేశారు. రేపు నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు ఆయన క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. తండేల్ సినిమాను మత్స్యకార కుటుంబాల నేపథ్యంతో దర్శకుడు చందూ మొండేటి రూపొందిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో మత్స్యకారుడి పాత్రలో నాగ చైతన్య కనిపించనున్నారు.

తండేల్ సినిమాలో నాగ చైతన్య జోడిగా హీరోయిన్ సాయి పల్లవి నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్ సైన్యానికి చిక్కిన తెలుగు జాలర్ల కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. టైటిల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో టైడ్ ను టైమ్ ను ఎదిరించి తన వాళ్ల కోసం పోరాడే నాయకుడిగా నాగ చైతన్య క్యారెక్టర్ ను పరిచయం చేశారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తండేల్ నిర్మితమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *