ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఎన్టీఆర్ ను ఆస్కార్ అవార్డ్ లో భాగమయ్యేలా చేసింది. ఆస్కార్ అందుకున్న తొలి ఇండియన్ సాంగ్ గా నాటు నాటు నిలిచింది. పాటలకు ఇలాంటి ఇంపార్టెన్స్ కూడా ఉంటుందని చెప్పింది. దీంతో తన కొత్త సినిమా దేవరలోనూ ఓ భారీ సాంగ్ కు ప్లాన్ చేస్తున్నారు ఎన్టీఆర్.

ఈ సినిమాలోని ఓ పాటను 2 వేల మంది డ్యాన్సర్స్ పాల్గొంటుండగా..పిక్చరైజ్ చేస్తున్నారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాట రూపకల్పనలో దర్శకుడు కొరటాల శివ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. రెండు భాగాల దేవర సినిమాలో ఫస్ట్ పార్ట్ వచ్చే ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నారు. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించబోతున్నారు. పాన్ ఇండియా రిలీజ్ కు దేవర సిద్ధమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *