పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ మూవీ ట్రైలర్ డేట్, టైమ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 1న సాయంత్రం 7.19 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు. ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రభాస్ పోస్టర్ అదిరిపోయింది. గన్ పట్టుకుని జీప్ పై నిల్చుని ఫైర్ చేస్తున్న ప్రభాస్ స్టిల్ సలార్ నుంచి రిలీజ్ చేసిన స్టిల్స్ లో ది బెస్ట్ అనుకోవచ్చు.
రెండు భాగాల సలార్ లో మొదటి భాగం సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. హోంబలే ఫిలింస్ బ్యానర్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రూపొందించారు. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సలార్ మూవీపై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.