పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమా ట్రైలర్ అనౌన్స్ మెంట్ రేపే రానుంది. ట్రైలర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ రేపు వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు. రెండు భాగాలుగా రానున్న సలార్ సినిమా ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ వచ్చే నెల 22న రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ సినిమా మీద దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ కాబట్టి సలార్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. సలార్ ట్రైలర్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.