పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమాల మధ్య వేటికీ సరైన టైమ్ కేటాయించలేకపోతున్నాడు. వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నా…వాటికి ఆయన డేట్స్ లేక ఇన్ టైమ్ లో కంప్లీట్ అవడం లేదు. పవన్ డేట్స్ లేక దర్శక నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు. సినిమాలు కూడా చాలా ఆలస్యమవుతున్నాయి. ఇప్పుడు పవన్ కున్న సినిమాలో ఓజీ ఒక్కటే స్పీడ్ గా అవుతోంది. మరి ఈ సినిమానైనా పవన్ కంప్లీట్ చేస్తాడా లేదా అనేది డౌట్ లో పడేస్తోంది.

పవన్ డేట్స్ లోని ఇబ్బందులు గుర్తుపెట్టుకునే దర్శకుడు సుజీత్ వీలైనంత ఫాస్ట్ గా ఓజీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే మేజర్ షూటింగ్ పూర్తయిందట. పవన్ నాలుగు వారాలు వరుసగా డేట్స్ ఇస్తే సినిమా కంప్లీట్ అవుతుందని టాక్. అయితే ఈ విషయంలో పవన్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు.

మరో రెండు నెలలు గడిస్తే ఏపీలోనూ ఎలక్షన్స్ హడావుడి మొదలవుతుంది. కాబట్టి పవన్ ఏ సినిమా కంప్లీట్ చేసినా ఈ రెండు నెలల్లోగానే జరగాలి. లేదంటే ఎలక్షన్స్ పూర్తయి రిజల్ట్ వచ్చేదాకా మళ్లీ షూటింగ్ కు డేట్స్ ఇచ్చే పరిస్థితి ఉండదు. పవన్ చేస్తున్న సినిమాల్లో ఓజీతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *