రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. రెహమాన్ సంగీతంలో ఓ పాట కూడా కంపోజ్ చేశారు. ఇప్పుడు హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్నారు. ఉప్పెన మూవీలో ఫ్రెష్ ఫేస్ కృతి శెట్టిని పరిచయం చేసి సక్సెస్ అందుకున్నారు బుచ్చిబాబు. చరణ్ సినిమాకూ ఇదే ఫార్ములాను ఆయన అప్లై చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

ఆర్సీ 16గా పిలుస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటి రవీనా టాండన్ కూతురు రాషాను సంప్రదిస్తున్నారట. ముంబై వెళ్లి ఆమెను ఆడిషన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ కథలోని క్యారెక్టర్ కు ఫ్రెష్ ఫేస్ ను తీసుకోవాలని డైరెక్టర్ ఆలోచన. అయితే రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో సరసన కొత్త హీరోయిన్ ఎంతవరకు యాప్ట్ అవుతుందని అనేది డౌట్.

ఆర్ఆర్ఆర్, గేమ్ ఛేంజర్ వంటి భారీ చిత్రాల తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా కూడా భారీ స్థాయిలోనే నిర్మాణం కానుంది. అలాంటి ప్రాజెక్ట్ కు హీరోయిన్ విషయంలో ప్రయోగాలు చేస్తున్నారా అనే టాక్ వినిపిస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామా కథతో ఆర్సీ 16 తెరకెక్కనుంది. వృద్ధి సినిమాస్ సంస్థతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *