లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అందాల చందమామ కాజల్ అగర్వాల్. కెరీర్ స్టార్ట్ చేసిన తక్కువ టైమ్ లోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కిన మగధీర సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాతో ఈ అమ్మడు దశ తిరిగింది. ఇక అప్పటి నుంచి కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. అయితే.. పెళ్లి చేసుకున్న తర్వాత కొంత గ్యాప్ ఇచ్చింది కానీ.. ఇప్పుడు మళ్లీ వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటుంది.

బాలయ్యతో భగవంత్ కేసరి సినిమా చేస్తుంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భగవంత్ కేసరి చిత్రం టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల చేయనున్నారు. రీసెంట్ గా లేడి ఓరియంటెడ్ మూవీ చేస్తుంది. ఇప్పుడు కింగ్ నాగార్జున సరసన నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుందట. అసలు నాగ్ తో ది ఘోస్ట్ మూవీలో నటించాలి. కాజల్ పై ఈ సినిమా కోసం కొన్సి సీన్స్ చిత్రీకరించడం కూడా జరిగింది. అయితే.. ఆ టైమ్ లోనే ప్రెగ్నెంట్ కావడంతో ఆ సినిమా నుంచి తప్పుకుంది. ఇప్పుడు మళ్లీ నాగ్ మూవీలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. మొత్తానికి ఈ అందాల చందమామ పెళ్లైన తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తుండడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *