మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ మెగాబ్రదర్స్ రీమేక్ అంటే చాలు వెంటనే ఓకే చెప్పేస్తున్నారు. ప్రస్తుతం రీమేక్ సినిమాలను జనాలు చూస్తున్నారా..? లేదా..? ఇవేం ఆలోచిండం లేదు. సక్సెస్ ఈజీగా వచ్చేస్తుందని భ్రమలో ఉంటున్నారో ఏమో కానీ.. రీమేక్ చేద్దామా అంటే.. ఈ రాజాలిద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. అన్నయ్య చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వాలి అనుకున్నాడు. స్ట్రైయిట్ మూవీతో రీ ఎంట్రీ ఇస్తే.. సక్సెస్ పై గ్యారెంటీ ఉండదనుకున్నారో ఏమో కానీ.. కత్తి సినిమా రీమేక్ రైట్స్ తీసుకుని ఖైదీ నెంబర్ 150 అంటూ రీ ఎంట్రీ ఇచ్చారు.

ఇక తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్య బాటలోనే రీ ఎంట్రీ ఇవ్వాలి అనుకున్నప్పుడు పింక్ మూవీని రీమేక్ చేశాడు. అదే.. వకీల్ సాబ్. అన్నయ్య అప్పుడప్పుడు రీమేక్ చేస్తుంటే.. తమ్ముడు అలా కాదు.. వరుసగా రీమేక్ లు చేయడమే పనిగా పెట్టుకున్నాడు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో.. ఇలా ఇక్కడ రీమేక్ లు మాత్రమే చేయబడును అనే బోర్డ్ పెట్టేసుకున్నట్టున్నారు పవర్ స్టార్. అన్నయ్య లూసీఫర్ మూవీని గాడ్ ఫాదర్ అంటూ రీమేక్ చేస్తే.. ఏదో ఫరవాలేదు అనిపించింది కానీ.. ఏమాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.

అయినా రీమేక్ ల పై చిరుకు మక్కువ తగ్గలేదు. ఇప్పుడు భోళా శంకర్ అంటూ వచ్చాడు. దీనికి ఫ్లాపుల దర్శకుడు మెహర్ రమేష్ ని దర్శకుడుగా ఎంచుకున్నారు. అసలే రీమేక్.. దీనికి మెహర్ డైరెక్టర్ అనుకున్నట్టుగానే ఏమాత్రం బజ్ క్రియేట్ అవ్వలేదు. థియేటర్లోకి వెళ్లిన ప్రేక్షకుడుకు నీరసం రావడం తప్పా.. ఎక్కడా వావ్ అనిపించలేదు. ఏదో రీ రిలీజ్ సినిమాని చూస్తున్న ఫీలింగ్ కలిగింది కానీ.. కొత్త సినిమా చూసిన ఫీలింగ్ ఏమాత్రం కలగలేదు. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఓటీటీ వచ్చింది.. ప్రపంచ సినిమా సామాన్యుడుకు కూడా అందుబాటులోకి వచ్చింది. అందువలన రీమేక్ మూవీ కథ ముందే తెలిసిపోవడం వలన ఏమాత్రం ఆసక్తి ఉండడం లేదు. రీమేక్ సినిమాల పని అయిపోయింది. భోళా.. బ్రో ఇకనైనా ఇది గుర్తించండి.. రీమేక్ లు చేయడం ఆపండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *