రవితేజ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా టైగర్ నాగేశ్వరరావు టీజర్ కు డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా టీజర్ ను ఆగస్టు 17న రిలీజ్ చేస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు. ఈ అనౌన్స్ మెంట్ తో పాటు ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. టైగర్ ఆక్రమణ మొదలు అంటూ క్యాప్షన్ రాశారు.

70,80 దశకాల్లో సౌత్ స్టేట్స్ ను గడగడలాడించిన స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు నూతన దర్శకుడు వంశీ. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. గాయత్రీ భరద్వాజ్, నుపూర్ సనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రేణు దేశాయ్ మరో కీలక పాత్ర పోషిస్తోంది. టైగర్ నాగేశ్వరరావు సినిమాను అక్టోబర్ 20న దసరా సందర్భంగా విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *