ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడో హాట్ టాపిక్ అయ్యింది. ఈ మధ్య ఏఐ తో తయారు చేసిన యాంకర్ వార్తలు చదవడం న్యూస్ ఛానెల్స్ లో సెన్సేషన్ అయ్యింది. ఆ మధ్య తమన్నా కావాలయ్యా పాటకు సిమ్రాన్, కాజల్ వెర్షన్స్ ను ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసి సర్ ప్రైజ్ చేశారు. ఇప్పుడీ టెక్నాలజీని సినిమాల ఫస్ట్ లుక్స్ తయారు చేయడంలోనూ ఉపయోగిస్తున్నారు.

తాజాగా దేవర సినిమాలోని ఎన్టీఆర్ లుక్ ను ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేశారు. ఈ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేవర టీమ్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కు కంప్లీట్ డిఫరెంట్ గా ఈ ఏఐ లుక్ ఉండటం విశేషం. ఆ మధ్య షారుఖ్ పఠాన్ ఏఐ వెర్షన్ లుక్స్ కూడా ఇలాగే ఆకట్టుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *