సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖుషి. ఇందులో విజయ్ కు జంటగా సమంత నటిస్తుంది. ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఖుషి సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. అయితే.. ఇటీవల విజయ్, పరశురామ్ కాంబో మూవీ సెట్స్ పైకి వచ్చింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. అయితే.. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. సెప్టెంబర్ 1న ఖుషి రిలీజ్ అయితే.. సంక్రాంతికి విజయ్, పరశురామ్ మూవీ నిజంగా విడుదల చేస్తారా..? అనే డౌట్ స్టార్ట్ అయ్యింది.

అయితే.. ప్రస్తుతం చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే నెలలో అమెరికాలో షూటింగ్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ తో దాదాపు ఎనభై శాతం షూటింగ్ పూర్తవుతుంది. అందుచేత ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికి రిలీజ్ చేయడం అనేది మిస్ కాదు. ఖచ్చితంగా ఈ చిత్రం సంక్రాంతికి వస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇందులో విజయ్ కు జంటగా సీతారామమ్ ఫేమ్ మృణాల్ ఠాగూర్ నటిస్తుంది. ఈ చిత్రానికి కుటుంబరామ్, ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ రెండూ కాకుండా వేరే టైటిల్స్ కూడా పరిశీలిస్తున్నారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *