BigbossBigboss: ఎక్కడో విదేశాలలో పుట్టి భారత్లో కూడా విపరీతమైన పాపులారిటీ దక్కించుకుంటున్న రియాల్టీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదట హిందీలో ప్రారంభించిన ఈ షో అక్కడ భారీ విజయం పొందడంతో తెలుగులో కూడా ఈ షో ప్రసారం చేశారు. మొదటి నాలుగు సీజన్లకు విపరీతమైన టిఆర్పి రేటింగ్ లభించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఈ బిగ్ బాస్ (Bigboss)మొదటి సీజన్ ను ప్రారంభించారు. ఆ తర్వాత రెండవ సీజన్ కి నాచురల్ స్టార్ నాని హోస్ట్గా వ్యవహరించారు. ఇక మూడవ సీజన్ నుంచి ఆరవ సీజన్ వరకు హోస్ట్ గా నాగార్జున వ్యవహరించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే తెలుగులో 6 సీజన్లను పూర్తి చేసుకుంది. అయితే ఐదు , ఆరు సీజన్లకు మిగతా నాలుగు సీజన్ల మాదిరి టిఆర్పి రేటింగ్ అయితే లభించలేదు. మరొకవైపు ఐదో సీజన్ పూర్తయిన తర్వాత హిందీలో బిగ్ బాస్ (Bigboss)నిర్వహకులు ఓటీటీ వెర్షన్ ప్రారంభించడంతో తెలుగులో కూడా దానిని లాంచ్ చేశారు. తెలుగు ఓటీటీ వెర్షన్ గత ఏడాది ప్రారంభమై పరవాలేదు అనిపించుకుంది. కానీ ఊహించిన స్థాయిలో టిఆర్పి రేటింగ్ అయితే లభించలేదు. అయితే ఈసారి రెండో సీజన్ ఉంటుందని అందరూ భావిస్తున్న తరుణంలో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది.

బిగ్ బాస్ సీజన్ 6 టీవీలో ప్రసారం చేసి ఓటిటిలో రిలీజ్ చేస్తేనే ప్రేక్షకులను ఆకట్టుకోలేదు అలాంటప్పుడు సీజన్ టు ఓటిటీ వర్షన్ రిలీజ్ చేస్తే ఎవరు మాత్రం చూస్తారు..? ఒకవేళ చూసి కనెక్ట్ అవుతే పర్వాలేదు.. ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోతే.. దానిపై పెట్టిన డబ్బంతా వృధా అవ్వడం తప్ప ఉపయోగం ఏమీ లేదని నిర్వాహకులు ఆలోచిస్తున్నారట అందుకే రెండవ సీజన్ ఓటిటి వెర్షన్ అసలు చేయకూడదు అని నిర్ణయించుకున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

మరొకవైపు బిగ్ బాస్ ఏడవ సీజన్ కి హోస్టుగా నాగార్జున తప్పుకొని రానా పేరు సజెస్ట్ చేయగా.. అన్ స్టాపబుల్ షో ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకున్న బాలయ్య చేత ఈ షోకి హోస్టుగా చేయించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *