Allu Aravind

Allu Aravind: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అల్లు ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. అల్లు కుటుంబం నుంచి మొదట అల్లు రామలింగయ్య ఇండస్ట్రీకి కమెడియన్ గా పరిచయమై ఎంతో మంచి గుర్తింపు తన ఫ్యామిలీకి తెచ్చిపెట్టారు. ఆ తర్వాత అల్లు అరవింద్ మొదట్లో కొన్ని సినిమాల్లో చేసి తనకు సినిమాల్లో నటించడం అంతగా సెట్ అవ్వదని సినిమాలకు నిర్మాతగా మారి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరిగా మారారు. ఇక ఈయన ముగ్గురు కొడుకులు కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లే. పెద్దకొడుకు తండ్రిలాగే నిర్మాతగా మారితే మిగిలిన ఇద్దరు కొడుకులు హీరోలుగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు .

వీరిలోఅల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోతే,అల్లు శిరీష్ హీరోగా నిలదొక్కుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అల్లు అరవింద్ (Allu Aravind) అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి మీద కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. కలర్ ఫోటో సినిమా ద్వారా ప్రధాన పాత్రలో వచ్చిన రైటర్ పద్మభూషణ్ సినిమా ఈ మధ్యకాలంలో విడుదలై మంచి సక్సెస్ అవ్వడంతో మూవీ యూనిట్ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసింది. ఆ సక్సెస్ మీట్ అల్లు అరవింద్ మాట్లాడుతూ.. నేను ఇన్నేళ్లైనా ఆరోగ్యంగా ఆక్టివ్ గా ఉన్నానంటే దానికి ప్రధాన కారణం యంగ్ స్టర్స్. ఎందుకంటే ప్రతిరోజు నేను వారితో కలిసి ఏదో ఒక పని చేయడం వల్ల వారికి ఉన్న ఎనర్జీ నాకు వచ్చింది.

అయితే మొదట ఈ సినిమాని రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు నాలో కాస్త భయం అనిపించింది.కానీ ఒకసారి ఈ సినిమా చూశాక రిలీజ్ చేయాలని భావించాను.ఇక ఈ సినిమా ప్రతి ఆడపిల్ల తన పేరెంట్స్ తో కలిసి చూడాల్సిన మంచి సినిమా. ఎందుకంటే మన సమాజంలో ఆడపిల్లలు అంటే వారిపై కొన్ని బాధ్యతలు ఉంటాయి.బాగా చదవాలి కానీ పెళ్లయినాక ఉద్యోగం చేయకుండా ఇంట్లో పిల్లల్ని, అత్తమామల్ని చూసుకుంటూ ఉండాలి. ఇంట్లో వాళ్లకి సేవ చేయాలి పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి. ఇలా వారి ఇష్టాలను తెలుసుకోకుండా ఇంట్లో ఒక బానిసలా చూస్తారు.

కానీ ఆడపిల్లలందరని తల్లిదండ్రులు వారి గోల్స్ ఏంటో అడిగి తెలుసుకుని వారి లక్ష్యానికి చేర్చే దిశగా అడుగులు వేయనివ్వాలి. ఇక నా కోడలు స్నేహ రెడ్డి (Sneha reddy) ఎంతో కోటీశ్వరుడి ఇంటి నుండి మా ఇంటికి కోడలుగా వచ్చింది. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ని పెళ్లి చేసుకుంది. అయితే స్నేహ రెడ్డి మా ఇంట్లో పని చేయాల్సిన అవసరం ఏముంది. కానీ ఆమె ప్రతిరోజు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. అంతేకాదు ఈ సినిమా చూశాక నేను నా భార్య దగ్గరికి వెళ్లి అసలు నువ్వు పెళ్లి కాకముందు ఏమవ్వాలనుకున్నావు అని అడిగాను అంటూ అల్లు అరవింద్ (Allu Aravind) తన కోడలి పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అల్లు అరవింద్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *