Taraka Ratna

Taraka Ratna: ప్రస్తుతం నందమూరి తారకరత్న బతికి బయటపడాలని చాలామంది నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే నందమూరి తారకరత్నను ప్రస్తుతం మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తరలించారని ఇప్పటికే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక ఇలాంటి నేపథ్యంలో విదేశాలకు తారకరత్నను తీసుకువెళ్తే ఆయన జాతకం ఇలాగే ఉండబోతుంది అంటూ ప్రముఖ జ్యోతిష్యురాలు చెప్పుకొచ్చింది.

జ్యోతిష్యురాలు మాట్లాడుతూ.. తారకరత్న (Taraka Ratna) ఆరోగ్యం విదేశాలకు మార్చితే కచ్చితంగా కుదుటపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఆయన ఆరోగ్యంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నారని,అందుకే ఆయన ఆరోగ్యం కుదుటపడుతుంది.అలాగే ఆయన డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా తెలియదు కాబట్టి ఆయన పుట్టిన తేదీ ప్రకారం ఆయనపై ఎక్కువగా శని ప్రభావం ఉంది.

అందువల్లే ఆయనకు ఇలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఈయన ఆరోగ్యం తొందరగా కుదుటపడాలంటే హనుమాన్ చాలీసా చదివి అలాగే మృత్యుంజయ హోమం చేస్తే కచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. విదేశాలకు వెళ్లడం వల్ల స్థాన మార్పు జరుగుతుంది కాబట్టి ఆయన ఆరోగ్యం బాగుంటుంది. తారకరత్న (Taraka Ratna) ఆరోగ్యం పై కేవలం శని, కుజగ్రహాల ప్రభావం మాత్రమే కాకుండా రాహువు కూడా ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తోంది.

తారకరత్న (Taraka Ratna) కు సంబంధించిన వాళ్ళు దానధర్మాలు చేస్తే ఖచ్చితంగా ఆయన ఆరోగ్యం మెరుగవుతుంది.గురు దత్తాత్రేయుని పూజిస్తే తారకరత్న మృత్యువు నుండి బయటపడతారు. అంతే కాదు నారాయణ బలి పూజ చేయడం వల్ల కూడా ఆయనకు ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అంటూ ప్రముఖ జ్యోతిష్యురాలు చెప్పుకోచ్చింది.ప్రస్తుతం ఆ జ్యోతిష్యురాలు చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *