Kiara Advani

Kiara Advani: ప్రస్తుతం దేశం మొత్తం కియారా అద్వానీ సిద్ధార్థ మల్హోత్రాల పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే వీరి పెళ్లి బాలీవుడ్ లోనే ఖరీదైన పెళ్లిగా ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరి పెళ్లి కోసం ఏర్పాటుచేసిన ప్యాలెస్ కి ఏకంగా రోజుకు రెండు కోట్ల రెంట్ ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది. ఇదిలా ఉండగా వీళ్ళిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ ఓపక్క బాలీవుడ్ జనాలు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటే మరోపక్క ఓ బిజినెస్ మ్యాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఆ బిజినెస్ కాపురంలో కియారా అద్వానీ చిచ్చు పెట్టిందట.

ఇంతకీ కియారా అద్వానీ (Kiara Advani) చేసిన పని ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారత్ పేకు ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్ డోగ్లాపస్ అనే ఒక ఆటో బయోగ్రఫీ రాసుకున్నాడు. అయితే తన భార్యకి తనకి మధ్య గొడవలు రావడానికి కియారా అద్వానీ కారణం అని ఉన్న ఒక పిక్ ని ఒక నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంతకీ కియారా అద్వాని వల్ల ఆ ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. అశ్నీర్ గ్రోవర్ ఓ రోజు తన భార్యతో కలిసి విదేశాలకు వెళ్ళాడట. ఇక అదే టైంలో ఆయనను ఎయిర్పోర్టులో దింపడానికి తన స్నేహితుడు వచ్చాడట. ఆ టైంలో అశ్నీర్ గ్రోవర్ నీ పెళ్ళెప్పుడు అని అడిగితే ఆ వ్యక్తి నువ్వు పెద్దోడివి అయిపోయావ్ అని అన్నాడు.

ఇక అదే రోజు సాయంత్రం ఆశ్నీర్ గ్రోవర్ (Ashneer Grover) వేరే దగ్గరికి వెళ్లాల్సి వచ్చినప్పుడు అశ్నీర్ గ్రోవర్ వాళ్ళ మమ్మీ వచ్చి.. నువ్వు చాలా మారిపోయావు పెద్దోడివి అయిపోయావ్ కనీసం నన్ను చూడడానికి కూడా నీకు టైం దొరకడం లేదు అని అశ్నీర్ గ్రోవర్ని అంది.దానికి అశ్నీర్ గ్రోవర్ నవ్వి.. ఈరోజుల్లో ఏం జరుగుతుందో నీకు అర్థం అవడం లేదు అమ్మ. ఒకవేళ ఇప్పుడు కనుక నేను పెళ్లి చేసుకుంటే బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీని వివాహం చేసుకునే వాడిని అంటూ అశ్నీర్ గ్రోవర్ జోక్ గా వేసాడట. అయితే తన భార్య ఈ మాటలు విని కోపంతో ఊగిపోయిందట. ఒక్కసారి గా ఆమె మొహం లో మార్పులు వచ్చి ఫ్లైట్ లో వెళ్తుండగానే కోపంతో నీకు కియారా అద్వానీని వివాహం చేసుకోవాలని ఉందా అని గట్టిగా అరిచింది.

నేను నచ్చనపుడు నన్ను పెళ్లి చేసుకోవడం ఎందుకు అని అడిగింది. అంతేకాదు ఫ్లైట్ లో వెళ్తుండగానే దాదాపు అరగంట పాటు గట్టిగా అరిచిందట. అంతేకాకుండా ఆమె ఒంటిపై ఉన్న నగలు అన్ని తీసి అశ్నీర్ గ్రోవర్ చేతిలోపెట్టిందని తన ఆటో బయోగ్రఫీగా రాసుకున్న డోగ్లాపస్ లో దీన్ని రాసుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్ ని ఒక నెటిజన్ షేర్ చేసి కియారా అద్వానీ (Kiara Advani) వల్ల అశ్నీర్ గ్రోవర్ ఆయన భార్య విడాకుల వరకు వెళ్లారు అంటూ ఒక కామెంట్ రాసుకోచ్చారు.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *