Mohan Babu

Mohan Babu: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేని పేరు. ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అంతే కాకుండా ఈయన నటవారసత్వంగా తన ఇద్దరు కొడుకులను కూతురిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కానీ వీళ్ళు మాత్రం తండ్రికి ఉన్నంత గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే మంచు మోహన్ బాబు ఎంత క్రమశిక్షణగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఈయన ముందు ఎవరు వెక్కిలి వేషాలు వేసినా క్రమశిక్షణగా లేకపోయినా వారి పని ఖతం. ఈయన షూటింగ్ సెట్లోకి వచ్చారంటే అక్కడున్న వాళ్లంతా సైలెంట్ అయిపోతారు. అలాంటి మోహన్ బాబు (Mohan Babu) ని ఓ మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరిచారట. మరి అలా ఎందుకు అరిచారో ఇప్పుడు తెలుసుకుందాం. మోహన్ బాబు ఇప్పటికే ఎన్నో వివాదాలు ఇరుకున్నాడు.ప్రతినిత్యం సోషల్ మీడియాలో తన పేరు ఉంటుంది. ఇక ఈ మధ్యకాలంలో అయితే మరీ ఎక్కువగా సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీ పై ట్రోల్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే గతంలో మ్యూజిక్ డైరెక్టర్ కోటి (Koti) కి మోహన్ బాబు కి ఓ గొడవ జరిగింది. మోహన్ బాబు హీరోగా చేసిన చాలా సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా కోటి చేసేవారట. కానీ మోహన్ బాబు మాత్రం కోటి దగ్గరికి వెళ్లి ప్రతిసారి ఈ మ్యూజిక్ బాలేదు ఆ మ్యూజిక్ బాలేదు ఆ ట్యూన్ తీసేయ్ అంటూ చాలా విసిగించేవారట. ఇక ఒకానొక టైంలో విసిగిపోయిన కోటి అసలు నా రికార్డింగ్ స్టూడియోలో నీకేం పని ఇక్కడి నుండి వెళ్ళిపో అని గట్టిగా అరిచాడట.దాంతో మోహన్ బాబు ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్లిపోయారట.

అయితే మోహన్ బాబు (Mohan Babu)  కోటి కాంబినేషన్లో వచ్చిన చాలా సినిమాలు మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.ఇందులో పెదరాయుడు ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనవసరం లేదు. అయితే కోటి మోహన్ బాబు కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో వీరిద్దరికి గొడవ జరిగినందువల్ల షూటింగ్స్ సెట్లో ఒకరి మొహాలు ఒకరు చూడడానికి కూడా ఇష్టపడలేదట. కానీ సాయంత్రానికల్లా మళ్లీ గొడవలు సమసిపోయి ఎప్పటిలాగే ఫ్రెండ్స్ లా ఉండేవారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *